మంచి జీవన‌శైలి, స‌రైన వ్యాయామంతో చ‌క్క‌టి ఆరోగ్యం

0
98

మనకు కాఫీ తాగే అలవాటు ఉంటే రోజుకు రెండు మూడు కప్పుల కాఫీ తాగవచ్చు. మనకు మందు తాగే అలవాటు ఉంటే రోజుకి ఒక్క గ్లాసు వైన్ తాగటం కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఒక్క గ్లాస్ తో ఆగగలగాలి. వైట్ రైస్ కి, వైట్ బ్రడ్ కి, షుఘర్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజూ నాలుగు రంగులకు చెందిన పండ్లు, కూరగాయలు తినడం మంచిది. టొమాటోలు తినడం కూడా చాలా మంచిది. సాంప్రదాయ వైద్యంలో నోటికి రుచిగా ఉండేవన్నీ ఆరోగ్యానికి హానికరమని అంటారు, కాని అది నిజం కాదు.. ఎర్ర ద్రాక్షలు, డార్క్ చాక్లెట్లు, ఉల్లిపాయలు, వాల్ నట్స్ తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచివి. మీకు చేపలు తినే అలవాటు ఉంటే ఎక్కువగా తినండి.

అందులో ఉండే మెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మీ ఆరోగ్యానికి, మీచర్మ సంరక్షణకు చాలా మంచిది. అలాగే మీ జీవన శైలిని కొంత మార్చుకోండి. రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోండి. పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానండి. పొగ తాగుతున్న వారికి కూడా దూరంగా ఉండండి. బయిటనుండి వచ్చాక సోప్ తో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రమాదకర‌ బ్యాక్టీరీయా నుండి రక్షణ ఉంటుంది. మనసిక ఒత్తిడినుండి వీలైనంతగా దూరంగా ఉండంది. కోపాన్ని అధిగమించే పద్దతులని అలవాటు చేసుకోండి. వీలైతే దానికోసం ఓ పెంపుడు జంతువును పెంచుకోండి.

నవ్వే సందర్భం వస్తే వీలైనంత ఎక్కువ సేపు నవ్వడానికి ప్రయత్నించండి. ఎండలో వెళ్ళేటప్పుడు సన్ గ్లాసస్ ధరించండి. పుస్తకాలు చదవడం, నాటకాలు, సినిమాలు చూడడం, క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయ్యడం అలవాటు చేసుకోండి. దాని వల్ల ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీజ్ఞాపక శక్తి మెరుగవుతుంది. విటమిన్ టాబ్లెట్లు, క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మరచిపోవద్దు. జాగ్రత్తగా వాహనం నడపండి. జీవిత భాగస్వామితోనే మంచి లైంగిక జీవితం గడపండి. మన జీవితంలో జరిగిన భాధకర సంఘటనలను వీలైనంత త్వరగా మరచిపోతూ, సంతోషం కలిగించే సంఘటనలను తరచు గుర్తుకు తెచ్చుకోండి. వీటిని పాటిస్తే మీ జీవితం ఆనందమయమవుతుంది.