అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ.

0
269

పిల్లల నుంచి వృద్ధుల వరకు. స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు. వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు. ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలకు. అంతా ఒకటే మంత్రం. యోగా. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం యోగా. శారీరక రుగ్మతలకు సొల్యూషన్ యోగా. ఆధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగా. A టు Z ఏ సమస్యయినా.. పరిష్కారం యోగానే అంటోంది ప్రపంచం. టెక్నాలజీలేవీ పుట్టకముందే పుట్టిన యోగా ఐదోసారి ప్రపంచ యోగా డేని జరుపుకోబోతోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది ప్రపంచం. యోగా ఎప్పటి నుంచో ఉంది. ప్రపంచంలో కూడా చాలా మంది.. చాలా ఏళ్లుగా యోగాని సాధన చేస్తున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేనంత ఉత్సుకత.. ఈ ఏడాది కనిపిస్తోంది. ప్రత్యేకంగా యోగాకి ఓ రోజు కేటాయించడం.. ఐక్యరాజ్యసమితి దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడంతో యోగా డేలో పాల్గొనేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమైంది.

ఒకప్పుడు.. భారత్ నుంచి అడుగులు ప్రారంభించి.. ఇప్పుడు దశదిశలా వ్యాపించిన యోగాని.. మళ్లీ ఇండియానే బ్రాండింగ్ చేయడం.. ఈ యోగాడే స్పెషల్. మారుతున్న పరిస్థితులకు తగినట్టు మానసిక, శారీరక ఒత్తిడిన జయించలేక సతమతమవుతోంది ప్రపంచం. ఉగ్రవాదం, తీవ్రవాదం, దోపిడీలు, దొంగతనాలు హెచ్చుమీరి.. క్రైమ్ వరల్డ్ గా మారుతోంది. వీటన్నిటి నుంచి.. ప్రపంచాన్ని రక్షించగల శక్తి.. అణుబాంబులకి కాదు.. యోగాకి మాత్రమే ఉందన్న నమ్మకంతో.. యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు గురుతర బాధ్యతను భుజానికెత్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దాన్ని UNO కూడా అత్యంత వేగంగా ఆమోదించింది. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే.. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా.. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.