క్రీడా ప్రపంచంలో కలకలం…షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్…

0
127

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనావైరస్ పాజిటివ్ గా తేలడంతో క్రీడా ప్రపంచంలో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయన తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం నుంచి ఆయన ఆరోగ్యం బాలేదని తెలిపారు. అయితే కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి, పాకిస్తాన్లోని పేదలకు అఫ్రిది నిరంతరం సహాయం చేస్తున్నాడు. తన బృందంతో పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలకు ఆయన సహాయక సామగ్రిని పంపిణీ చేస్తున్నాడు. అఫ్రిదికి కరోనా సోకడంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు