మామిడికాయ ఒరుగులు తయారీ ఎలా?

0
868

మామిడికాయలు 10, ఉప్పు తగినంత, పసుపు ఒక టేబుల్ స్పూన్ ఎలా తయారు చేస్తారు? ముందుగా మామిడికాయలను తొక్కు తీసి పొడవుగా సన్న సన్నగా ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత ఓ పాత్ర తీసుకుని ముక్కలు, టెంకలు సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక పెద్ద వస్త్రంమీద అరబెట్టాలి. ఇలాగా ఓక వారంపాటు బాగా ఎండబెట్టాలి. ముక్కలను పట్టుకుంటే విరిగిపోయేలాగా ఉండాలి. ఈ ఒరుగులను గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ ఒరుగులు యేడాదిపాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులో వేసుకుని చేసుకోవచ్చు. మనం మామిడికాయల సీజన్లో పప్పు మామిడి చేసుకుంటాము. అన్ సీజన్‌లో ఒరుగులతో పప్పుచేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుది. ఇకెందుకు ఆలస్యం మామిడి ఒరుగులను తయారు చేసేందుకు ప్రయత్నించండి.