ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్న కరోనా.

0
167

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతూ… ప్రపంచ దేశాల్ని భారత్ వైపు ఆశ్చర్యంగా చూసేలా చేస్తున్నాయి. ఒకప్పుడు ఇండియాలో కరోనా రాకుండా భలే అడ్డుకున్నారే అనుకున్న దేశాలన్నీ ఇప్పుడు ఇండియాలో నమోదవుతున్న కరోనా కేసుల్ని తెలుసుకొని… ఎందుకలా అని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 9985 మందికి కరోనా సోకడంతో… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 276583కి చేరింది. అలాగే… నిన్న ఒక్కరోజే 279 మంది చనిపోవడంతో… మొత్తం మరణాల సంఖ్య 7745కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా సోకిన ప్రతి 1000 మందిలో 28 మంది చనిపోతున్నారు. తాజా లెక్కల ప్రకారం నిన్న 5991 మంది కోలుకున్నారు. అందువల్ల కోలుకున్న వారి సంఖ్య 135205కి చేరింది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులు ఉన్న దేశాల్లో ఇండియా ఆరో స్థానంలో ఉంది. అదే రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత బ్రెజిల్, అమెరికా తర్వాత మూడోస్థానంలో ఉంది. తాజాగా దేశంలో మొత్తం శాంపిల్ టెస్టుల సంఖ్య 50 లక్షలు దాటి… 5061332కి చేరింది. గత 24 గంటల్లో 145216 మందికి టెస్టులు చేశారు.

ఇండియాలో కరోనా ఆగేదెప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. తొలిసారిగా డీఎంకే ఎమ్మెల్యే అన్బాళగన్ కూడా కోరోనా సోకి కన్నుమూశారు. అంటే… సామాన్య ప్రజల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ఎవరూ కరోనా నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇండియాలో సోషల్ డిస్టాన్స్ సరిగా అమలు కాకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందని నిపుణులు అంటున్నారు.