కరోనా రాకుండా చేయాలంటే ఇలా చేయండి.

0
229

ఓ వైపు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కష్టపడుతున్నాయి. చాప కింద నీరులా విజృంభిస్తున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, కరోనా రాకుండా చేయాలంటే ఓ పని చేయాలంటూ సోషల్ మీడియాలో మూఢ నమ్మకాలు జోరుగా ముచ్చట్లు పెడుతున్నాయి. పట్టణాల దగ్గర నుంచి గ్రామాల వరకు చాలా మంది ఈ మూఢ నమ్మకాన్ని పాటిస్తున్నారు. అదేంటో తెలుసా.. ఒకరిద్దరు కొడుకులు ఉన్న తల్లులు ఐదు ఇళ్లలోంచి తీసుకొచ్చిన నీటిని వేప చెట్టుకు పోస్తే కరోనా రాదంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని నమ్మిన అమాయక మహిళలు వేప చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ నీళ్లు పోసేస్తున్నారు. కొందరైతే ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

virus 3d illustration

అటు.. ఈ సారి ఉగాది మంచి గడియలో రాలేదని, వేప చెట్టుకు నీళ్లు పోస్తే మంచిదని కూడా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్, టిక్‌‌టాక్, ఫేస్‌బుక్‌లో దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. కానీ.. అదేదీ నిజం కాదు. అందులో ఎంత మాత్రం సత్యం లేదంటున్నారు విజ్ఞానవేత్తలు. ఎండాకాలం కాబట్టి చెట్లకు నీళ్లు పోస్తే మంచిదేనని.. అయితే, మూఢ నమ్మకాలతో మోసపోవద్దని సూచిస్తున్నారు