ముఖం జిడ్డుగా మారుతుందా..

0
244

ఈ కాలంలో వాతావరణంలోని తేమ వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. అదనంగా దుమ్మూధూళీ చేరితే… మొటిమలు తప్పవు. వీటన్నింటికీ పరిష్కారం ఈ పూతలు. ప్రయత్నించి చూడండి.
తేనె, చక్కెరతో…
ఈ రెండింటిని సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, మృదువుగా మర్దన చేయాలి. పావుగంటయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ముఖంపై పేరుకుపోయిన మురికి, జిడ్డు తొలగిపోవడమే కాదు… చర్మ     రంధ్రాలూ శుభ్రపడి జిడ్డు సమస్య ఎదురుకాదు.
ముల్తానీ మట్టితో…
చెంచా ముల్తానీ మట్టిలో రెండు చెంచాల   నీరు కలపాలి. ఈ ముద్దను ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేయాలి. ఈ మట్టి ముఖంపై ఉన్న దుమ్ము, మురికి, జిడ్డును తొలగించి చర్మాన్ని మెరిపిస్తుంది.
సెనగపిండి, నిమ్మరసంతో…
మూడు చెంచాల సెనగపిండిలో చెంచా నిమ్మరసం, సరిపడా పెరుగు వేసి పూతలా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంటాగి చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే   జిడ్డు సమస్య ఉండదు.


అదనంగా: ఈ కాలంలో  గోరువెచ్చటి నీటితోనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అదీ రోజులో రెండుసార్లు మాత్రమే. జిడ్డుగా ఉందని రకరకాల ప్రయోగాలు చేయకూడదు.