తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం

0
121

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

ఉదయం మొదటి సెషన్ లో మహిళా జర్నలిస్టుల అభ్యున్నతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చిన ముఖ్య అతిథులు “రాష్ట్ర విద్యా శాఖ మంత్రి – సబితా ఇంద్రారెడ్డి గారు”, “రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి – సత్యవతి రాథోడ్ గారు”, “ప్రభుత్వ విప్ – గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారు”, “తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ – సునీతా లక్ష్మారెడ్డి గారికి” ప్రత్యేక ధన్యవాదాలు.

రెండవ సెషన్ లో మహిళల అస్థిత్వం : లింగ వివక్ష మీడియా ధోరణుల అంశంపై …ఎట్లా ఆలోచించాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే స్పష్టతనిస్తూ స్ఫూర్తి నింపిన ప్రొఫెసర్.విమల కొల్లాపూర్ గారికి, మీడియాలో కొరవడుతున్న మహిళల ప్రాతినిధ్యం : వార్తలు – సమస్యల కొరత అంశంపై వాస్తవాలను కళ్ళకు కట్టిన ప్రొఫెసర్. పద్మజా షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

తెలంగాణ మహిళా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లేలా ఈ రోజు వర్క్ షాప్ నిర్వహించుకున్నాం.. ఇదే ఉత్సాహంతో రేపటి కార్యక్రమాలను విజయవంతం చేద్దాం..