ప్రముఖ టీవీ నటి శిల్పా షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహారాష్ట్ర పార్టీ చీఫ్ సంజయ్ నిరుపమ్, సీనియర్ నేత చరణ్ సింగ్ సప్రా సమక్షంలో మంగళవారం ఆమె కాంగ్రెస్‌లో చేరారు. 1999లో టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన 42 సంవత్సరాల శిల్పా షిండే ప్రముఖ టెలివిజన్ షో బాభీతో గుర్తింపు పొందారు.
కాగా, ప్రజల్లో ఆదరణ పొందిన టీవీ షో బాబీ జీ ఘర్ పర్ హైలో అంగూరి బాభీగా ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో బిగ్‌బాస్ 11లో పాల్గొన్న షిండే విన్నర్‌గానిలిచింది. కాగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాల్లోనే గెలుపొందింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ బరిలో దిగే అవకాశం ఉంది.