బిర్యానీ ఆకులు – వెల్లుల్లి రెబ్బలో పైల్స్‌కు చెక్.. ఎలా?

0
92

సాధారణంగా ఇపుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య పైల్స్ (మొలలు). మలబద్దకం, థైరాయిడ్, డయాబెటీస్, మాసం, ఫాస్ట్ ఫుడ్స్‌ను అధికంగా ఆరగించడం, ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ సమస్య బారిన పడుతుంటారు. ఈ బాధను భరించడం కూడా చాలా కష్టం. అయితే, ఈ సమస్య నుంచి కొన్ని చిట్కాల వల్ల త్వరితగతిన బయటపడొచ్చు. ఒక పాత్ర‌లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు, నాలుగైదు వెల్లుల్లి రెక్క‌లు నీటిలో వేయాలి. ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్ర‌మం మ‌రిగాక దాన్ని చ‌ల్లార్చి స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.