మరణమా…? కవి హృదయం

0
126

మరణమా…?

మరణం నాకెప్పుడూ ఆనందమే
నా రాక కోసం అణునిత్యం ఎదురుచూస్తున్న గొప్ప మిత్రుడు మరణం
ఎంతోమందిని వదిలివెళ్లినా తనలో ఐక్యం చేసుకుంటూ లాలిస్తుంది మరణం
ఇక తన పరిచయంతోనే జీవిత గమ్యం ముగుస్తుందని గుర్తుచేస్తుంది మరణం
బతుకంతా పోరాడింది తనకోసమేనని హత్తుకుంటుందీ మరణం
చావు, పుట్టుకల మధ్య కొట్టు మిట్టాడే జీవితములో ఎన్నో సార్లు నన్ను హత్తుకుందామనుకుందీ మరణం..
తన గమ్యాన్ని చేరలేదు
కానీ ఎప్పుడో ఒకసారి తనలో ఐక్యం అవతానని మాత్రం నాకెరుక
నేడు మొదలైన నా అస్తిత్వం
ఎప్పుడు అస్తమిస్తుందో ఎదురుచూస్తూ..

రచన: రంజిత్ బబ్బూరి