కావాల్సిన సరకులు:
టమాటోలు 400 గ్రాములు
లవంగాలు 10
యాలకలు 10
బియ్యం 1కిలో
కొబ్బరి కాయ 1
జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు
వెల్లులిపాయ 1
దాల్చిన చెక్క చిన్నముక్క
ఉల్లిపాయలు 100 గ్రాములు
పచ్చిమిర్చి 15
నూనె 100 గ్రాములు
అల్లం చిన్న ముక్క.
తయారు చేసే విధానం:
ముందుగా బియ్యం కడిగి అరగంట పాటు నానబెట్టాలి. కొబ్బరి పాలు తీసి వుంచాలి. కొబ్బరి పాలు దాదాపు 2 లీట్లరు వుండాలి. టమాటాలు సన్నగా తరగి పెట్టుకోవాలి. అల్లం, వెల్లులి, జీలకర్రను మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వుంచుకోవాలి.
స్టౌపై గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తర్వాత అందులో దాల్చినచెక్క, యాలకలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేసి బాగా వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరిపాలు పోసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడు నానపెట్టిన బియ్యం, ఉప్పు, ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్టు వేసికలిపి బాగా వుడికించాలి. అంతే ఎంతో రుచికరమైన టమాటో బాత్ సిద్ధం.