నా భర్త చితక్కొడుతున్నాడు.. భరించలేకపోతున్నా : హీరోయిన్ చెల్లి గగ్గోలు

Baghban Actress Arzoo Govitrikar Accuses Husband Of Domestic Violence

0
101
Arzoo Govitrikar
Arzoo Govitrikar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం తమ్ముడు. ఈ చిత్రంలో హీరోయిన్ అదితి గోవిత్రీకర్. ఈమె సోదరి ఆర్జూ గోవిత్రీకర్. 2010 మార్చి 15న ఆర్జూ గోవిత్రీకర్ తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ సబర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. 2003లో వచ్చిన అమితాబ్ సినిమా ‘బాగ్‌బన్’లో ఆర్జూ గోవిత్రీకర్ నటించి పేరు తెచ్చుకున్నారు.

గతకొంతకాలం సజావుగానే వీరి కాపురం సాగింది. కానీ, ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో భర్త నుంచి ఆర్జూకు వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ వారిద్దరూ ఘర్షణ పడుతున్నట్టు తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె పోలీసులకు అందించింది.

అయితే ఈ ఆరోపణలను ఆమె భర్త సిద్ధార్థ్ సబర్వాల్ ఖండించారు. తాను తన భార్యను కొట్టలేదని తెలిపారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నది ఒక సీన్ షూటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించినది అని వివరించారు. ఒక క్రైమ్ షోకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమెను కొట్టాల్సి వచ్చిందన్నారు. ఇదిలావుండగా, మహిళా దినోత్సవానికి సరిగ్గా రెండు రోజుల మందు ఈ గృహహింస కేసు వెలుగులోకి రావడం గమనార్హం.