వేసవికాలంలో ఎంచుకునే దుస్తుల నుంచి కాలికి వేసుకునే చెప్పులవరకూ అన్నీ వేడిని గ్రహించి చల్లదనాన్ని అందించేవిగా ఎంచుకోవాలి. పైగా ట్రెండీగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాషన్‌గానూ కనిపించాలి. అలాంటివాటిని వెతికి పట్టుకోవడం కాస్త శ్రమే అయినా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా అలాంటివాటిని ఎంపిక చేసుకోవచ్చు.
* వెదురు నారతో చేసిన చెప్పులు వేసవి కాలానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇవికాకుండా కలంకారీ, జీన్స్‌తో చేసిన చెప్పుల రకాలెన్నో అందుబాటులో ఉన్నాయి. ఇక జనపనారతో చేసిన జ్యూతీలూ, ఫ్లిఫ్‌ఫ్లాప్స్ సంగతి చెప్పనే అక్కర్లేదు.
* అలానే జ్యూట్, కలంకారీ, జీన్స్ హ్యాండ్‌బ్యాగ్‌లూ, బ్యాక్‌ప్యాక్‌లూ చల్లదనాన్ని ఇచ్చేవే. అచ్చంగా వాటినే ఎంచుకోవచ్చు లేదా వేరే వస్త్రంతో కలిపి డిజైన్ చేసిన వాటినీ మీ అవసరానికి తగ్గట్లుగానూ ప్రయత్నించొచ్చు. ఇవేకాదు ప్రింటెడ్ లినిన్, ఇకత్ స్కార్ఫ్‌లూ వేసుకోవచ్చు.
* వేసవి కాలంలో వీలైనంత తక్కువ నగల్ని వేసుకోవడమే మంచిది. టెర్రకోట, చెక్క, డై-ఫ్లవర్ జ్యూయలరీ బాగుంటుంది. వీటితోపాటు కలంకారీ చెవిపోగులూ, నెక్లెస్‌లు హుందాతనాన్ని తెచ్చిపెడుతన్నాయి.
* వీలైనంతవరకూ ఈ కాలంలో హైనెక్‌లూ, కాలర్ నెక్‌ల వంటివాటికంటే రౌండ్ నెక్‌లూ, కోల్డ్‌షోల్డర్‌ల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. కుర్తీలకు ఫ్రంట్, సైడ్ స్లిట్ డిజైన్‌లు నప్పుతాయి.
* వేసవి కాలంలో కాటన్ వస్త్రాలు ఎంతో సౌకర్యంగా ఉండటమే కాదు, చెమటనూ పీల్చేసుకుంటాయి. అలాంటివాటిల్లో నూలు, లినిన్, రేయాన్, పోచంపల్లి ఇకత్, మంగళగిరి కాటన్, పొందూరు ఖద్దరుతో పాటు ఇప్పుడు నారతో చేసిన వస్త్రం అందుబాటులో ఉంటుంది.