సమంత కూడా ‘ఆర్ఎక్స్100’ హీరోయిన్‌లా రెచ్చిపోతుందా?

Samantha in RX 100 director Ajay Bhupathi Movie

0
105
Samantha Akkineni
Samantha Akkineni

అక్కినేని ఇంటి కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంతకు మరో మూవీ ఛాన్స్ వచ్చింది. నిజానికి ఆమెకు పెళ్లి తర్వాతే మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆర్ఎక్స్100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి నిర్మించనున్న చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ ప్రాజెక్టుకు ఆయన ‘మహా సముద్రం’ అనే పేరును ఖరారు చేశారు. మల్టీ స్టారర్‌గా రానున్న ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం హీరోయిన్ సమంతను ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇటీవలే అజయ్ సమంతతో ఈ విషయమై సంప్రదింపులు కూడా జరిపినట్లు ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రాజెక్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తోపాటు మరో యువ హీరో కూడా నటించనున్నట్లు టాక్. విశాఖపట్నం నుంచి జరుగుతున్న అక్రమ రవాణాల నేపథ్యంలో ‘మహా సముద్రం’ కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే అజయ్ భూపతి ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి మరి.

కాగా, బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన ఆర్ఎక్స్100 చిత్రంలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. అందాలను ఆరబోయడం మొదలుకుని లిప్‌లాక్ ముద్దుల్లో మునిగితేలింది. ఆ విధంగా ఆమెతో సన్నివేశాలను దర్శకుడు అజయ్ భూపతి తీయించాడు. ఇపుడు సమంతను దర్శకుడు ఆ రేంజ్‌లో చూపిస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది.