నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే….

0
160
sa

నా మాటల వెనుక ఎంతో అర్థం ఉంటే

నా మౌనం వెనుక ఇంకెంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది..

నా అక్షరాలే సాక్ష్యాలుగా నిలిచిపోతూ ఉంటే

నాది కాని నాతో ప్రయాణించే కాలం నన్నే దోషిని చేస్తుంది..

– – సందీప్ కిలాడి

ఒంటరితనం ఊపిరై తోడుగా వస్తుంటే

నాలోని తుంటరి భావాలు అణచివేతకు గురవుతున్నాయి..

అనివార్యమైన ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే

అలుపెరగని బాటసారికి ఎన్నో అవమానాలు ఎదురవుతున్నాయి..

అవరోధాలు అదిరోహిస్తాను

అవమానాలు భరిస్తాను..

చివరకు నాకు నేనే అవుతాను

ఎవరు ఏమన్నా నన్నే నే చూపిస్తాను.. – – సందీప్ కిలాడి