జోరుమీదున్న ‘మన్మథుడు’… రమ్యకృష్ణతో ఫిక్సయ్యాడు..

0
58
ramya krishna - Nagarjuna
ramya krishna - Nagarjuna

అక్కినేని నాగార్జున నటించిన చిత్రం “మన్మథుడు”. ఆయన క్రేజ్‌ను మరింతగా పెంచిన చిత్రం. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ రానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందా అని నాగ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి తాజాగా తెలిసింది. మన్మథుడు-2 చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రారంభించి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారట. ఈ చిత్రం తొలి షెడ్యూల్ 10 నుంచి 15 రోజుల పాటు జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. పైగా, ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలన్న సంకల్పంతో ఉన్నారు.

ఇక కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో ‘బంగార్రాజు’ ప్రాజెక్టును కూడా నాగ్ పట్టాలెక్కించనున్నారు. తన సొంత బ్యానర్‌పై రెండు సినిమాలను దాదాపు ఒకేసారి నాగ్ నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రమ్యకృష్ణ నటించనుంది. నాగచైతన్య ఈ చిత్రంలో నాగ్‌కు మనుమడిగా నటించనున్నాడు.