టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు గత ఏడాది తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్‌లతో పాటు వీరి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ ఫోటోలు అప్పుడప్పుడు నెట్టింట వైరల్ అవుతూ వుంటాయి.
తాజాగా ఇజాన్ అప్పుడే టెన్నిస్ బ్యాట్ పట్టేశాడు. పట్టుమని రెండేళ్లు నిండని ఈ చిన్నారి టెన్నిస్ బ్యాట్ పట్టిన ఫొటోను సానియా మీర్జా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇక తాజాగా టెన్నిస్ ప్రాక్టీస్ నిమిత్తం కుమారుడితో కలిసి వచ్చిన ఆమె, బ్యాట్ పట్టిన కొడుకు ఫొటోను పంచుకుంటూ, ఈ రాకెట్ ఇజాన్‌కు కాస్త పెద్దది కావచ్చునని సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ కాగా, ఇజ్జీని టెన్నిస్ ఆటగాడిని చేస్తారా? క్రికెటర్‌ను చేస్తారా? అంటూ సానియా, మాలిక్‌ల జోడీపై అభిమానులు, నెటిజన్లు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.