గుత్తాకు – జితేందర్ రెడ్డికి షాకిచ్చిన తెరాస చీఫ్ కేసీఆర్

0
54
trs logo
trs logo

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఆ పార్టీ నేతలకు తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా తాజా మాజీ ఎంపీలైన గుత్తా సుఖేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలకు ఆయన మొండిచేయి చూపించారు.

వచ్చే 11వ తేదీన జరుగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలు ఉండగా, అందులో ఒకటి తన మిత్రపక్షమైన ఎంఐఎంకు టీఆర్ఎస్ కేటాయించింది. అయితే, ఎంఐఎంపైనా స్నేహపూర్వక పోటీగా తమ అభ్యర్థిని టీఆర్ఎస్ నిలిపింది. మొత్తం 17 స్థానాలకు తమ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు వాటి వివరాలు.

కరీంనగర్- బి.వినోద్ కుమార్
నిజామాబాద్- కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్- జి.నగేశ్
మెదక్- కొత్త ప్రభాకర్ రెడ్డి

భువనగిరి-బూర నర్సయ్య గౌడ్
వరంగల్- పసునూరి దయాకర్
నాగర్ కర్నూల్- పి.రాములు
ఖమ్మం- నామా నాగేశ్వరరావు

సికింద్రాబాద్- తలసాని సాయికిరణ్ యాదవ్
మహబూబ్ నగర్- మన్నె శ్రీనివాస్ రెడ్డి
మహబూబాబాద్- మాలోత్ కవిత
నల్గొండ- వేమిరెడ్డి నరసింహారెడ్డి

పెద్దపల్లి- వెంకటేశ్
చేవెళ్ల- గడ్డం రంజిత్ రెడ్డి
జహీరాబాద్- బీబీ పాటిల్
హైదరాబాద్-పుస్తె శ్రీకాంత్
మల్కాజ్ గిరి- మర్రి రాజశేఖర్ రెడ్డి