ఓపెన్ స్టేజ్ డ్యాన్సింగ్‌తో ఉత్తర భారతదేశంలో పేరు సంపాదించిన స్టార్ సప్నా చౌదరి. బీహార్, యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి డ్యాన్సులు చాలా పాప్యులర్. ఇక ఈ డ్యాన్సులు చేసేవాళ్లలో సప్నా చౌదరి బాగా ఫేమస్. ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.
అయితే, హర్యానాకు చెందిన సప్నా చౌదరి కాంగ్రెస్‌లో చేరిందంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినికి మధుర లోక్ సభ నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు సప్నా చౌదరిని కాంగ్రెస్ బరిలో దింపుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెల్లువెత్తాయి.
అయితే ఈ వార్తలను సప్నా చౌదరి కొట్టిపారేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రియాంక గాంధీతో తనతో వున్న ఫోటో పాతదని.. క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి ప్రచారం చేయడంలేదని కూడా తేల్చి చెప్పింది. ఆఖరికి తనపేరిట ప్రచారంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్ కూడా ఫేక్ అని సప్నా స్పష్టం చేసింది.