లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు విడుదలకు సెన్సార్ లైన్ క్లియర్…

0
70

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం విడుదలకు తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డు చెప్పారు. కానీ, సెన్సార్ బోర్డు మాత్రం విడుదలకు సమ్మతించింది. దీంతో ఈనెల 29వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.

ఈ చిత్రంలో ఉన్న సీన్లు, డైలాగ్స్ ఎన్నికల కోడ్ పరిమితికి లోబడే ఉన్నట్లు జారీ అయిన మానిటరింగ్ కమిటీ మీడియా సర్టిఫికేషన్‌ను నిర్మాత రాకేశ్ రెడ్డి ఈసీకి సమర్పించారు. ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా కథనం గురించి ఈసీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాం. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. ఈసీ ఎదుట హాజరవ్వాలని చెప్పారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరిని తక్కువచేసి చూపించడం లేదని, ఎన్టీఆర్ జీవితం చివరి దశలో జరిగిన విషయాలను చెప్పేందుకే ఈ సినిమా చేశామని ఈసీకి చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రం లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించినట్లు వెల్లడించారు.