ఏపీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల భవిష్యత్, అభ్యర్థుల విజయావకాశాలపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోగా.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజమమని ప్రకటించుకుంటున్నాయి. ఇంకా బెట్టింగులు కూడా ముదిరిపోతున్నాయి.
ఇప్పటికే పోస్ట్ పోల్ సర్వేపై దృష్టి పెట్టారు రాజకీయ నేతలు. తమ తమ నియోజకవర్గాల ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీలు కూడా ఇదే పద్ధతి ఎంచుకున్నాయి.
ప్రజలకు ఫోన్‌చేసి.. అభ్యర్థుల పేర్లు ప్రస్తావించకుండా నేరుగా టీడీపీ, వైసీపీ, జనసేనల్లో దేనికి వేశారని అడుగుతున్నారు. ఇంకోవైపు.. బెట్టింగ్‌రాయుళ్లూ బరిలోకి దిగారు. కోట్ల డబ్బు పందేల్లో తగలబడి పోకుండా చూసుకోవడానికి వారి పోస్ట్‌పోల్ సర్వేకు ఉపక్రమించారు. ఇలా బెట్టింగ్ నారా లోకేశ్, అఖిలప్రియ, గంటా, దేవినేనిలపై జరుగుతోందని సమాచారం. లక్షల్లో ఈ బెట్టింగులు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.