గురువారం (25-04-2019) రాశిఫలాలు

0
67

మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యక్రమాలలో స్త్రీలు చురుకుగా పాల్గొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. రుణయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

వృషభం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. ఆస్థి పంపకాలలో సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వాహన ఛోదకులకు చికాకులు తప్పవు. కోర్టు వ్యవహారాలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టవచ్చు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.

కర్కాటకం : ఉద్యోగస్తులకు హోదా పెరగటంతోపాటు బాధ్యతలు అధికం అవుతాయి. మీ కార్యక్రమాలు, పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. ప్రతి వ్యవహారంలో లౌక్యంగా వ్యవహరించటం మంచిది. సంఘంలో మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. కార్యసాధనలో ఒడిదుడుకులను అధిగమిస్తారు.

సింహం : స్త్రీలు తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాలలో పునరాలోచన అవసరం. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగానే ఉండటంవల్ల ఇబ్బందులు ఏ మాత్రం ఉండవు. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.

కన్య : చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. స్త్రీలకు అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. అనుకోని ఖర్చులు ఇతరత్రా సమస్యలవల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

తుల : కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలసి రాగలదు. ప్రేమికుల అవగాహనా రాహిత్యం అనర్థాలకు దారితీస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి. పుణ్య కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. వైద్యులకు, రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారికి కలసి రాగలదు.

వృశ్చికం : ఆర్థికంగా ఎదిగేందుకు మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలలో మెలకువ వహించండి.

ధనస్సు : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులవల్ల చికాకులు తప్పవు. ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు కొత్త వ్యక్తులపట్ల అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. స్త్రీలు పనివారల నుంచి చికాకులను ఎదుర్కొంటారు.

మకరం : స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల్లో చిక్కులు, సమస్యలు, ఆర్థిక నష్టం కలుగుతుంది. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లోని వారికి మెలకువ అవసరం. రచయితలకు పత్రికా రంగాల్లోని వారికి సత్కాలం. కిరాణా, ధాన్యం వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి కలసిరాగలదు.

కుంభం : బంధుమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ధనం విరివిగా వ్యయంచేసినా సార్థకతా, ప్రయోజనం ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లోని వారు తోటివారితో స్నేహభావంతో సంచరిస్తారు. ముఖ్యుల సలహాలు పాటించటంవల్ల వ్యాపారంలో పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం అవుతాయి.

మీనం : మీ ఆర్థిక స్థితికి ఏ మాత్రం లోటుండదు. నిర్మాణ పనుల్లోని కాంట్రాక్టర్లకు మెలకువ అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. పోస్టల్, టెలిగ్రాఫిక్ రంగాలలోని వారికి చికాకులు తప్పవు. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. గృహంలో తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.