సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్యాసనులతో పోల్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అని చెబుతూ, వారిని దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు.
పశ్చిమ బెంగాల్‌లోని హావ్డా ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో రాజకీయ మహాభారతం నడుస్తోందన్నారు. 100 మంది ఉన్న కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసన పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటామన్నారు.
అలాగే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ బీజేపీలోనూ కేవలం మోదీ, అమిత్ షా పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటామన్నారు. మహా భారతంలో చివరకు కౌరవులు ఎదుర్కొన్న పరిస్థితులనే, దేశంలో జరుగుతున్న రాజకీయ మహా భారతంలోనూ బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సీతారాం ఏచూరి పేర్కొన్నారు.