వరల్డ్ కప్ : భారత్ – ఆసీస్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌కు ప్రిన్స్

0
87

వరల్డ్ కప్ పోటీలు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు అనేకమంది సెలెబ్రిటీలు వెళుతుంటారు. ముఖ్యంగా, భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లంటే సామాన్య అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తారు.

అందునా ఆస్ట్రేలియా వంటి జట్టుతో, అది కూడా వరల్డ్ కప్ అయితే… ఆ మ్యాచ్ పై ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తాను నటించిన ‘మహర్షి’ సూపర్ హిట్ కావడంతో, ప్రస్తుతం తన ఫ్యామిలీతో పలు దేశాల్లో పర్యటిస్తూ, ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఆదివారం ఓవ‌ల్ మైదానంలో జరిగే ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌‌కి భార్యా, పిల్లలతో కలిసి హాజ‌రు కానున్నాడ‌ట‌. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఇక స్టేడియంలో మహేశ్, భారత జట్టుకు మద్దతిస్తూ, ఎలా అల్లరి చేస్తాడో వేచి చూడాలి.