వైకాపాలోకి చీరాల ఎమ్మెల్యే?

0
58

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన‌ వైకాపాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను ఆమంచి కృష్ణమోహన్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈనెల 13న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమంచి‌ ఆ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని తన నివాసంలో సన్నిహితులు, ముఖ్యకార్యకర్తలతో కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు.