2019-20 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రము యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.1,82,017 కోట్లు. రెవిన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లుగా లెక్కించారు. మూలధన వ్యయం రూ.32,815 కోట్లుగా అంచనా వేశారు.
* 2019-20 బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు కేటాయింపు.
* 500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8లక్షల నిధులు.
* టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.1.41లక్షల కోట్ల పెట్టుబడులు.
* టీఎస్‌ఐపాస్ ద్వారా రూ.8,419 పరిశ్రమలకు అనుమతులు.
* 8.58లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
* ఈఎన్‌టీ, దంత పరీక్షలు రూ.5,536కోట్లు.
* పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ.3,256 కోట్లు.
* ఒక్కో మనిషికి రూ.1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు.
* ఆసరా పింఛన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.12,067 కోట్లు కేటాయిస్తున్నాం.
* నిరుద్యోగ భృతి కోసం రూ.1810 కోట్లు.
* ఎస్సీల ప్రగతి కోసం రూ.16,581కోట్లు.
* ఎస్టీల అభ్యున్నతి కోసం రూ.9,827కోట్లు.
* మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు.
* రైతు రుణ మాఫీ కోసం రూ.6 వేల కోట్లు.
* బియ్యం రాయితీకి రూ.2,774 కోట్లు.
* రైతు బీమా కోసం రూ.650 కోట్లు.
* రైతు బంధు సాయం ఎకరానికి రూ.10వేలు.
* రైతు బంధు కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు.
* వ్యవసాయశాఖకు రూ.20,107కోట్ల కేటాయింపు.