చక్కని చర్మ సౌందర్య చిట్కాలు…

0
83

చర్మం మెరవాలంటే వీలున్నప్పుడల్లా హోమ్ మేడ్ ప్యాక్‌లు ఆప్లై చేస్తుండాలి. ఈ ప్యాక్స్ వల్ల ఎలాంటి హాని ఉండక పోగా చక్కగా పోషకాలు అందుతాయి. అలాంటి ప్యాక్‌లు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. పెరుగుతో.. చల్లని పెరుగుని తీసుకోని అందులో చిటికెడు చక్కర కలిపి చర్మానికి పట్టించాలి. తర్వాత ఓ బత్తాయి తీసుకోని దానిని అడ్డంగా కట్ చేసి దాన్ని పెరుగులో అద్ది ముఖానికి కాసేపు మర్దనా చేయాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంటే డల్‌నేస్ పోయి ముఖం కాంతివంతగా మారుతుంది. బోప్పయితో.. బొప్పాయి గుజ్జుని తీసుకుని అందులో కొంచెం ఓట్స్, చల్లని పాలు కలిపి ముఖానికి ఆప్లై చేసి కాసేపు మర్దనా చేయాలి. తర్వాత నీళ్లు కలిపిన పాలతో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం పొడిబారకుండా తేమను సంతరించుకుంటుంది.