టీ- కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. ఇంకా ముక్కుసూటిగా మాట్లాడేందుకు ఏమాత్రం వెనుకాడరు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు వున్నారని వ్యాఖ్యానించారు.
సమయం వచ్చినప్పుడు ఆ కోవర్టుల పేర్లు బయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ వ్యాఖ్యలు టీ-కాంగ్రెస్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇంకా కోవర్టులను ఉత్తమ్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆ విషయం తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ ఫార్టీలో కోవర్టులు ఉన్నారని ఎప్పటి నుంచో చెబుతున్నానని చెప్పుకొచ్చారు.