విజయ్‌కి హ్యాట్రిక్ ఖాయం

0
52

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 64వ చిత్రం మొదటి షెడ్యూల్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా యువ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా రెహమాన్ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంతకుముందు ఎన్నడూ సౌత్ ఇండియా సినీ చరిత్రలో ఇలాంటి స్క్రిప్ట్‌రాలేదని ఈ చిత్రం ‘లగాన్, పీకే’ తరహాలో ఉండనుందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీన్నిబట్టి ఈ చిత్రం అట్లీ, విజయ్‌కి హ్యాట్రిక్ విజయాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘తెరి, మెర్సల్’ సూపర్ హిట్ అయ్యాయి. ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది.