ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం దక్కింది. కేరళ అసెంబ్లీ కి రావాలని స్పీకర్ పి శ్రీరామకృష్ణన్ ఎంపీ కవితకు ఆహ్వాన లేఖ పంపించారు. ఈ నెల 23న దేశంలోని వర్సిటీల విద్యార్థులతో నిర్వహించే కేరళ అసెంబ్లీ సదస్సుకు రావాలని కవితను ఆహ్వానించారు. అంతేకాకుండా ఈ సదస్సులో ప్రసంగించాలని కవితను కోరారట. అంతేకాకుండా అదేరోజు జరగనున్న ‘క్యాస్ట్ అండ్ ఇట్స్ డిస్ కంటెంట్స్’ అనే అంశంపై ప్రసగించాలని స్పీకర్ కోరారు.
ఈ సదస్సుకు ఎంపీ కవిత , కేరళ సీఎంతో పాటు దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారని, అంతేకాకుండా దేశవ్యాప్తంగా 2 వేల మంది జాతీయ విద్యార్థులు సదస్సులో పాల్గొంటారని శ్రీరామకృష్ణన్ లేఖలో తెలిపారు. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను గత ఏడాది అగస్టులో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించిన విషయం తెలిసిందే.