భారత – పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా శత్రుదేశం పాకిస్థాన్ భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రితో అదనపు బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు వెంబడి సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సి) నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని కీలకమైన, సున్నితమైన కేంద్రాల్లో బలగాల మోహరింపు పెరిగిందని సమాచారం.
నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారత్ కూడా బుధవారం దాయాది దేశానికి గట్టి హెచ్చరికే చేసింది. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, దుస్సాహసానికి దిగినా, ఎల్వోసీ వెంబడి పౌరులను లక్ష్యంగా చేసుకున్నా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వార్నింగ్ ఇచ్చింది. నౌషెరా సెక్టార్‌లోని ఫార్వర్డ్ పోస్టులను లక్ష్యంగా చేసుకున్న పాక్ 155 ఎంఎం ఆర్టిలరీ తుపాకులతో బలగాలను మోహరించింది. ప్రతిగా భారత సైన్యం భోఫోర్స్ తుపాకులను సిద్ధంగా ఉంచింది.