చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహం. టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలి..

0
281

గాల్వన్ లోయలో ఉద్రిక్తత తర్వాత చైనా తీరుపై భారత్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. చైనా వస్తువులు, మొబైల్ యాప్స్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చైనా వస్తువులను తగులబెడుతున్నారు. ఇక నుంచి చైనీస్ ప్రొడక్ట్స్ వాడబోమంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఐతే కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. భారత్‌లో చైనీస్ రెస్టారెంట్లను నిషేధించాలన్న ఆయన..తాజాగా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.

కాగా, గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత చైనాపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని.. దాదాపు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు 5జీతో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులను భారత కంపెనీలు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూదని టెలికాం మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశించింది. అటు ప్రజలు సైతం తాము చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.