మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం “అ… ఆ…” ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. వరుస విజయాలతో అతి తక్కువ కాలంలోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది. తొలుత ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ సినిమాలతో వరస విజయాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం తెలుగులోనే కాదు ఏ భాషలోనూ ఒక్క సినిమా కూడా చేయడం లేదు. గతేడాది “హలో గురు ప్రేమకోసమే” తర్వాత తెలుగులో ఏ సినిమా అంగీకరించలేదు. ఇటీవలే కన్నడలో పునీత్ రాజ్ కుమార్‌తో నటించిన “నట సార్వభౌమ” సూపర్ హిట్ అయినా కూడా అక్కడా అవకాశాలు రావడం లేదు.
దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్. అక్కడే అందాల ఆరబోత చేస్తూ.. గ్లామర్ షో ఒలకబోస్తుంది. తనకు అవకాశం ఇచ్చే దర్శకుడి కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ వైపు ఏ దర్శకుడు కూడా చూడటం లేదు. దాంతో ఫోటోషూట్లు తప్ప మరో పనేదీ లేదు ఈ బ్యూటీకి.
దానికి కారణం కూడా లేకపోలేదు. కెరీర్ మొదట్లో వరసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండటంతో దర్శక నిర్మాతలు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భయపడుతున్నారు.
దాంతో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ టైమ్ పాస్ చేస్తుంది ఈ భామ. ఈ మధ్యే ట్విట్టర్లో లవ్ అనే టీ షర్ట్ వేసుకుని పోజులిచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఇది చూసిన వాళ్లంతా నిజంగానే అమ్మడు ప్రేమలో పడిందేమో అనుకుంటున్నారు. మరి ఈ షర్ట్ వెనక ఉన్న రహస్యం ఏంటో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చెప్పాలి.