కళ్ళ కింద నల్లటి వలయాలకు కారణాలివే…

0
40

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపకపోతే అవి శరీరానికి, చర్మానికి హాని చేస్తాయి. ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే రోజూ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలి.

కొన్నిసార్లు హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నా కూడా నల్లని వలయాలు ఇబ్బంది పెడతాయి. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే ఓసారి హిమోగ్లోబిన్‌ శాతాన్ని తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. ఐరన్ శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పరిస్థితిని బట్టి వైద్యులు సలహాలు పాటించాలి.

నిద్రలేమి, ఒత్తిడి కూడా నల్లని వలయాలకు ప్రధాన కారణం. వీటిని అదుపులో ఉంచాలంటే… వేళకు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఒత్తిడి తగ్గాలంటే రోజూ ధ్యానం చేయాలి. మన ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి.

రోడ్డు పక్కన దొరికే చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు, జంక్‌ఫుడ్‌ కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. అందుకని వాటన్నింటినీ తగ్గించి, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.