కాంచన-3 హిట్ ఖాయమంటున్న రాఘవ లారెన్స్

0
92

హారర్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా, కథానాయకుడిగా లారెన్స్ ఘన విజయాలను అందుకున్నాడు. అలాంటి లారెన్స్ నుంచి మరో హారర్ థ్రిల్లర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కాంచన 3’తో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించడానికి లారెన్స్ సిద్ధమైపోయాడు. తెలుగులో ఈ సినిమాను నిర్మాత బి.మధు విడుదల చేస్తున్నాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ, “ఇంతకుముందు లారెన్స్ నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలకి మించి ‘కాంచన 3’ ఉంటుంది. బలమైన, వైవిధ్యభరితమైన కథను ఆయన తెరకెక్కించాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడ్డాడనేది తెరపై కనిపిస్తుంది. కథాకథనాలు.. గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. తమన్ అందించిన రీ రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేస్తున్నాము. ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చాడు.