టీవీ నటి వాణి భోజన్‌కు ఛాన్సిచ్చిన అర్జున్ రెడ్డి

0
92

‘కింగ్ ఆఫ్ ది హిల్’ బ్యానర్‌ను అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పతాకంపై చిన్న చిన్న సినిమాల నిర్మాణానికి విజయ్ శ్రీకారం చుట్టాడు. తాజాగా ఈ బ్యానర్‌పై రూపొందే తొలి సినిమాలో ప్రధాన పాత్రలకి గాను, దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను, యాంకర్ అనసూయను ఎంపిక చేశారు. తాజాగా ఇందులో మరో కీలకమైన పాత్రలో తమిళ టీవీ నటి వాణి భోజన్ కనిపించనుందనేది తాజా సమాచారం.

తమిళ టీవీ సీరియల్స్ ద్వారా అక్కడి బుల్లితెర ప్రేక్షకుల్లో వాణి భోజన్‌కు మంచి క్రేజ్ వుంది. తాజాగా విజయ్ బ్యానర్‍‌పై రూపుదిద్దుకుంటున్న సినిమా ద్వారానే ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఇంకేముంది.. హీరోగా మంచి హిట్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవర కొండ.. నిర్మాతగాను హిట్ కొడతాడేమో తెలియాలంటే వేచి చూడాలి.