తెలుగులో ‘అవును’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు హర్షవర్థన్ రాణే. ఆ తర్వాత హిందీలో పలు ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు వెళ్లారు. అక్కడ ‘ఖడ్గం’ ఫేం కిమ్ శర్మను లైన్లో పెట్టి.. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఈ ఇద్దరూ ముంబై రోడ్లపై కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారుకూడా. అయితే ఈ జంట తమ రిలేషన్ షిప్‌కు స్వస్తి చెప్పినట్లు ఇప్పటికే వార్తలు చక్కర్లు కొట్టాయి.
తాజాగా కిమ్‌తో బ్రేకప్ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టత ఇచ్చాడు. “ధన్యవాదాలు నీతో ప్రయాణం అద్భుతం.. అంతకంటే ఎక్కువ. నీకు, నాకు దేవుడి దీవెనలు ఉండాలి.. బై” అని పోస్ట్ పెట్టాడు.
ఈ పోస్ట్‌తో కిమ్, హర్షవర్దన్ మధ్య దాదాపు బ్రేకప్ అయిపోయినట్లేనని తెలుస్తోంది. గతంలో క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో డేటింగ్‌లో ఉన్న కిమ్ శర్మ.. అతనికి బై చెప్పి హర్షవర్దన్‌తో కలిసి తిరిగిన విషయం తెల్సిందే.