మే డే రోజున ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

0
89

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. ఎన్.టి.ఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించింది, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గత నెల 29వ తేదీన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా, ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై అక్కడి హైకోర్టు స్టే విధించింది. అంతేకాక.. అక్కడి లాయర్లు ఈ సినిమాను వీక్షించిన తర్వాతే.. ఈ సినిమా విడుదలకు అంగీకరిస్తామని తేల్చి చెప్పింది.

అయితే ఇపుడు ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ విడుదలకు లైన్ క్లియర్ అయింది. వచ్చే నెల మే ఒకటో తేదీన ఏపీలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ విషయాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు.

ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో ఓ ఫోటోని కూడా ఆయన పోస్ట్ చేశారు. ‘ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతోంది’ అంటూ ఆయన ఆనందం వ్యక్తంచేశారు.