ఫ్రాన్సే వేదికగా 72వ కేన్స్ ఫిల్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రపంచం నలుమూలల నుంచి ప్రఖ్యాత సినీ స్టార్స్ హాజరవుతున్నారు. భారత్ నుంచి కూడా అనేక మంది హీరోయిన్లు వెళ్లారు. ఈ ఉత్సవాల్లో భారతీయ సంప్రదాయంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
రెండు రోజుల క్రితం ప్రియాంక, దీపికా పదుకొణే, కంగనా వెరైటీ డ్రెస్సులతో రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఇక తాజాగా గోల్డెన్ గౌన్ డ్రెస్సులో రెడ్‌కార్పెట్‌పై మెరిసింది ఐశ్వర్యా రాయ్. సాగరకన్య తరహాలో ఉన్న గౌన్‌ను ధరించిన ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. కూతురు ఆరాధ్యతో సహ ఐశ్వర్య ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది.
ఇక మరుసటి రోజు ఐశ్వర్యరాయ్ తెలుపు రంగు దుస్తులలో జిగేల్‌మంది. స్వర్గం నుండి దిగి వచ్చిన దేవ కన్యలా అనిపించింది. రెడ్ కార్పెట్‌పై తెలుపు దుస్తులతో హోయల్ పోతున్న ఐశ్వర్యరాయ్‌ని చూసిన వీక్షకులకి రెండు కళ్ళు చాలలేదట. ప్రతి ఏడాది కేన్స్ ఉత్సవాలలో పాల్గొంటున్న ఐష్ ఈ సారి సరికొత్త లుక్స్ తో ఆకట్టుకుంటుంది. మే 25 వరకు కేన్స్ ఉత్సవాలు జరగనుండగా, పలు చిత్రాల ప్రదర్శన జరుగుతుంది.