బుల్లితెరతో పాటు.. బిగ్ స్క్రీన్‌పై రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి భావన. తనకు ఏదేని సినిమా ఆఫర్ వస్తే రెమ్యునరేషన్ కంటే… కథను చూస్తానని చెప్పారు. పైగా, నిర్మాతలను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయనని, వారు చెప్పినట్టుగా నడుచుకుంటానని తెలిపింది.
ఇదే అంశంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది సినిమాల కంటే సీరియల్సేనని చెప్పింది. అందుకే సినిమాల కంటే సీరియల్స్ ముఖ్యమంత్రి తెలిపింది. పైగా, తాను సీనియర్ ఆర్టిస్టును కనుక పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుందన్న భావన చాలా మందిలో ఉందన్నారు.
నిజానికి తనకు డబ్బు కంటే తాను నటించే చిత్ర కథ ముఖ్యమన్నారు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయకుండా పట్టువిడుపుల ధోరణితో ముందుకు సాగుతానని చెప్పింది. పైగా, నిర్మాతలను ఇబ్బందులకు గురిచేయకుండా ముందుకు సాగుతానని తెలిపింది.
పైగా, షూటింగ్‌లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే వస్తానని చెప్పనని, షూటింగ్‌కు ఎపుడు పిలిచినా రెక్కలు కట్టుకుని వాలిపోతానని చెప్పింది. ముఖ్యంగా, దర్శకనిర్మాతలను ఇబ్బందులకు గురిచేయనని నటి భావన అంటోంది.