దేవుడు రాసిపెడితే పెళ్లి జరుగుతుంది.. నేనేం చేయలేను : నగ్మా

South Indian Actress Nagma talk about her marriage

0
102
South Indian Actress Nagma
South Indian Actress Nagma

ఒకపుడు తెలుగు ఇండస్ట్రీనే కాదు.. దక్షిణాది చిత్రసీమను ఊపిన ఉత్తరాది భామల్లో నగ్మా ఒకరు. ఆ తర్వాత బాలీవుడ్‌లో సైతం అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. అన్ని భాషల్లో దాదాపు అగ్ర నటులందరితో నటించి మంచి పేరుకొట్టేసింది. ఆ తర్వాత సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. 45 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.

తాజాగా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అనే ప్రశ్న నగ్మాకు మీడియా నుంచి ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ, ‘పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది. ఎవరికైనా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేను’ అంటూ చెప్పుకొచ్చింది. పైగా, తాను పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా ఈ రాజకీయ మహిళా నాయకురాలు అంటోంది.