మరదలిపై కన్నేసిన బావ.. పలుమార్లు అత్యాచారం.. ఆంబులెన్స్‌లోనే ప్రసవం..

0
69
Does a broken hymen decides a girl's virginity.

కామాంధులు ఎక్కడపడితే అక్కడ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి.. శారీరకంగా మహిళలను వాడుకుంటున్నారు. తాజాగా ఓ బావ మరదలిని లొంగదీసుకున్నాడు. ఆమె ఇంటర్ విద్యార్థిని. అంతటితో ఆగలేదు.. బావ ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆంబులెన్స్‌లోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఓ ఇంటర్ విద్యార్థిని ఆంబులెన్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. కళ్యాణదుర్గానికి చెందిన బాలిక అనంతపురంలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది. పట్టణంలోనే ఉంటున్న తన అక్కబావల ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది. ఇలా వచ్చిపోతూ వుండిన మరదలిపై బావ కన్ను పడింది. ప్రేమ పేరుతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని.. ఏవేవో మాయమాటలు చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోయినా బలవంతంగా లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.

గర్భం దాల్చిన బాలిక తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఇటీవల స్వగ్రామానికి వచ్చేసింది. ఆదివారం రాత్రి ప్రసవ వేదన పడుతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.