అమలాపాల్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లోని కుర్రకారు హీరోయిన్లలో ఒకరు. కానీ, తెలుగు చిత్రపరిశ్రమ ఈ అమ్మడుకి ఏమాత్రం కలిసిరాలేదు. మెగా హీరోల సరసన నటించినప్పటికీ క్లిక్ కాలేకపోయింది. అందుకో కోలీవుడ్‌పై దృష్టిసారించింది. అక్కడ కుర్రకారు హీరోయిన్లతో డేటింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. అయినా ఏమాత్రం బెరవలేదు.
ప్రస్తుతం తమిళంలో ఓ రేంజ్‌లో అందాల ఆరబోస్తున్న హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అక్కడే ఇలా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. మధ్య మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో కూడా సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. అమల సోషల్ మీడియాలో మహా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం బీచ్. స్కూల్‌కు మళ్ళీ వచ్చా. ఈసారి సర్ఫింగ్ స్కూల్. సర్ఫింగ్ నేర్చుకుంటున్నా’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం తమిళనాట వరస సినిమాలతో దూసుకుపోతున్న అమలా పాల్.. ఆమె నటించిన ‘రాక్షసన్’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక బికినీని తలపించే ఫస్ట్‌లుక్‌తో వచ్చిన ‘ఆడై’ త్వరలోనే రిలీజ్ కానుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా అలాగే రెచ్చిపోతుంది. తాజాగా బీచ్‌లో అమ్మడు ఫుల్లుగా అందాలు ఆరబోస్తూ పోజులు ఇచ్చింది. ఇది చూసి కుర్రాళ్ల గుండెలు గతి తప్పుతున్నాయి. అంతగా తన అందాలతో రెచ్చగొడుతుంది.