చైనా దూకుడికి బదులెక్కడ.. వాహ్ కాశ్మీర్‌ను ఏం చేయాలనుకుంటున్నారు..
చైనా దూకుడుకు బదులేది అంటూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ సర్కారువి అన్నీ వైఫల్యాలేనని ఓవైసీ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో ఓవైసీ నిప్పులు చెరిగారు.
మన సాయుధ దళాలు ఉపయోగించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో చైనా మెటీరియల్ ఉంటుంది, మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీపైనా చైనా ముద్ర ఉంది, ఇప్పుడు మసూద్ అజర్ విషయంలోనూ చైనాదే పైచేయిగా నిలిచింది, విదేశాంగ విధానాల వైఫల్యంలో మాత్రం మోదీనే టాప్ అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
అంతేకాదు, జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్ సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరపాలన్న కేంద్రం నిర్ణయాన్ని కూడా ఒవైసీ విమర్శించారు. ఎక్కడైనా ఒక్క పార్లమెంటు స్థానానికి మూడు రోజుల పాటు పోలింగ్ జరగడం చూశారా? అంటూ ప్రశ్నించారు. “వాహ్ మోదీగారూ వాహ్.. కాశ్మీర్‌ను ఏం చేయాలనుకుంటున్నారని ఓవైసీ ప్రశ్నించారు.