సుప్రసిద్ధ శబరిమల ఆలయం కేసులో తీర్పు ఇచ్చిన కారణంగా ముస్లిం మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ట్రిపుల్ తలాఖ్‌పై విజయం సాధించిన ముస్లిం మహిళలు.. తాజాగా మసీదుల్లోకి ముస్లీమ్ మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనీ, ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేలా అనుమతిని ఇవ్వాలని కోరుతూ పూణెకి చెందిన దంపతులు సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
మసీదుల్లోకి ముస్లిమ్ మహిళల ప్రవేశానికి చట్ట బద్ధంగా అనుమతించాలని కోరుతూ దాఖలైన ఈ పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. ఈ విషయంపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, ఏ దేశంలోనైనా సరే మసీదుల్లోకి ముస్లీమ్ మహిళలను అనుమతిస్తున్నారా? అని పిటీషనర్ల తరఫు న్యాయవాదులను అడిగింది.
కెనడా .. మక్కాల్లో అనుమతిస్తున్నారని వారు సమాధానం ఇచ్చారు. దీంతో ఈ పిటీషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేసులో తీర్పు ఇచ్చినందువల్లనే ఈ పిటీషన్‌ను కూడా స్వీకరించినట్టు జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.