తన వ్యక్తిగత జీవితంపై అసత్య వార్తలు రాస్తూ క్యాష్ చేసుకుంటున్నారని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పుకొచ్చారు. ఆమె తాజాగా మీడియాపో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో దిశా పటాని డేటింగ్‌లో ఉందని చాలా రోజులుగా వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. అయితే ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీలు, ఈవెంట్లకు అటెండ్ అవుతుండటం ఈ వార్తలకు బలాన్నిచ్చింది.
ఈ పుకార్లపై ఇప్పటివరకు ఈ విషయమై స్పందించని దిశా.. తాజాగా స్పందించింది. ‘నా వ్యక్తిగత విషయాలను మీడియా వర్గాలు సొమ్ము చేసుకుంటూ రోజుకో గాసిప్ సృష్టిస్తూ రాసేస్తున్నారు. అయినా దీని వల్ల నాకు కలిగే నష్టం ఏమీ లేదు. నేను ఇండస్ట్రీలో పనిచేయడానికి ఉన్నాను. నా పనికి భంగం కలిగించే వార్తలు వస్తే అప్పుడు నేను బాధపడాలి.
ఒకవేళ నా సినిమాల్లో నా నటన నచ్చలేదని ఎవరైనా చెబితే అది నాపై ఎంతో ప్రభావం చూపుతుంది. అంతేకానీ వీటితో నాకొచ్చే నష్టమేమీ లేదు. నాకు బాలీవుడ్‌లో ఎలాంటి స్నేహితులు లేనప్పటికీ నా గురించి ఇన్ని వార్తలు ఎలా బయటికి వస్తున్నాయో అర్థంకావడం లేదు’ అని వ్యాఖ్యానించింది.