తెలుగు సీనియర్ హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. స్టార్ హీరో జగపతిబాబు హీరోయిన్ అని ముద్రకూడా ఈమెకు ఉంది. ‘యమదొంగ’, ‘పెళ్లైన కొత్తలో’ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చి ఢీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోంది.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈమె… ఇపుడు రానా దగ్గుబాటి సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజా సమాచారం. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఒక భారీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘విరాటపర్వం 1992’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. దాదాపు ఈ టైటిల్‌నే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం ‘టబు’ను తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను ప్రియమణిని తీసుకున్నారట. ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రియమణికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి.