టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ – టాలీవుడ్ దర్శకుడు అల్లు అరవింద్‌ల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం సినిమాలనే నమ్ముకోకుండా ఏదో ఒక వ్యాపారం చేయాలని అల్లు అర్జున్ భావించారు. కానీ, ఆయన తండ్రిగా అల్లు అరవింద్ అంగీకరించలేదన్నది సమాచారం.
ముఖ్యంగా, ప్రస్తుతానికి సినిమాలపైనే పూర్తి దృష్టిపెట్టమని అల్లు అరవింద్ చేసిన సూచనను ఆయన పట్టించుకోవడం లేదనే టాక్ ఫిల్మ్ నగరులో వినిపించింది. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జోరందుకుంది. ఈ కారణంగానే అల్లు అర్జున్.. సొంతగా ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.
దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ‘నేను నా భార్యా బిడ్డలతో కలిసి మా అమ్మానాన్నలతోనే ఉంటున్నాను. ప్రతిరోజు మా నాన్న.. నేను కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటాము. మా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా వచ్చిన పుకార్లను వినేసి మేము నవ్వుకున్నాం. మా నాన్నకి.. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. మేమంతా చాలా సంతోషంగా వున్నాం’ అని చెప్పుకొచ్చాడు.