ప్రభాస్‌ – శంకర్ కాంబోలో మూవీ… ఆసక్తి చూపని నిర్మాతలు?

0
76

టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో కోలీవుడ్ దర్శకుడు ఎస్.శంకర్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏ ఒక్క నిర్మాత ఆసక్తి చూపడం లేదన్నది ప్లాన్. దీనికి కారణాలు లేకపోలేదు.

శంకర్ మూవీ ప్రారంభించాడంటే అధి ఖచ్చితంగా భారీ బడ్జెట్ మూవీగానే ఉంటుంది. కానీ, ఖర్చుకు మాత్రం అంతం అనేది ఉండదన్నది వారి అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే విశ్వనటుడు కమల్ హాసన్‌తో శంకర్ ప్రారంభించిన “భారతీయుడు-2” చిత్రం ఆగిపోయింది.

ఈ చిత్ర యూనిట్ బడ్జెట్ విషయంలో ఖచ్చితంగా ఉంది. అనుకున్న సమయంలో అనుకున్నంత బడ్జెట్ లోపు చిత్రాన్ని నిర్మించాలన్న షరతు విధించింది. ఇది శంకర్‌కు రుచించలేదు. క్వాలిటీ విషయంలో శంకర్ ఏమాత్రం రాజీపడరు. దీంతో బడ్జెట్ అనేది అనుకున్నదానికంటే ఎక్కువగా పెరిగిపోతుంది. ఇపుడు ప్రభాస్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందన్న అభిప్రాయంతో నిర్మాతలు ఉన్నారు.

అందుకే ప్రభాస్ – శంకర్ కాంబినేషన్‌లో వచ్చే చిత్రానికి నిర్మాతగా ఉండేందుకు ఏ ఒక్క నిర్మాత సాహసం చేయడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, శంకర్ – ప్రభాస్ కాంబినేషన్‌లో ఎలాంటి చిత్రం ప్లాన్ చేయడం లేదని శంకర్ అనుచరులు స్పష్టంచేశారు.